- జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
కోరుట్ల, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో జిల్లా 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జగిత్యాల కలెక్టర్సత్యప్రసాద్ టీచర్లకు సూచించారు. గురువారం కోరుట్ల మండలం కల్లూరులోని మోడల్ స్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. స్కూల్‌లో పరిసరాల పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు. మిడ్ డే మీల్స్‌ను పరిశీలించి, నాణ్యతతో కూడిన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని విద్యార్థులకు సూచించారు. కోరుట్ల ఆర్డీవో ఆఫీస్‌ను సందర్శించారు.
అనంతరం కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు.ఆయన వెంట ఆర్డీవో జీవాకర్ రెడ్డి, డీఈవో రాము, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీవో రామకృష్ణ, ఎంఈవో నరేశం, సెక్టోరియల్ ఆఫీసర్ సత్యనారాయణ, ఏఈ ధనుంజయ్, శశికుమార్, అధికారులున్నారు.
