కొండగట్టు హుండీ ఆదాయం రూ.1.16 కోట్లు.. 43 రోజుల ఆదాయం.. 14 హుండీలు కౌంటింగ్

కొండగట్టు హుండీ ఆదాయం రూ.1.16 కోట్లు.. 43 రోజుల ఆదాయం.. 14 హుండీలు కౌంటింగ్

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయంలో గురువారం ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. 43 రోజులకు సంబంధించిన 14 హుండీలను లెక్కించగా రూ.కోటి 16 లక్షల 4 వేల 438 ఆదాయం వచ్చింది. అలాగే 199 విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు. లెక్కింపు సందర్భంగా వచ్చిన బంగారం, వెండిని తిరిగి హుండీలో భద్రపరిచామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో హరిహరనాథ్, సూపరింటెండెంట్​ సునీల్ పాల్గొన్నారు. 

ఐనవోలు ఆదాయం38.73 లక్షలు..

వర్ధన్నపేట(ఐనవోలు): ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో గురువారం శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సేవా సమితి, మహబూబాద్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు 30 రోజుల కాలానికి హుండీ ద్వారా రూ.38,73,858 ఆదాయం లభించింది. ఇందులో వివిధ ఆర్థిక సేవా టికెట్ల ద్వారా రూ.1,10,54,223 వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెండి, బంగారాన్ని సీల్ చేసి హుండీలో భద్రపరచారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ అబ్జర్వర్​ డి.అనిల్ కుమార్, ఆలయ ఈవో కందుల సుధాకర్, చైర్మన్ కమ్మగొని ప్రభాకర్
 పాల్గొన్నారు.