- ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకం: కోదండరాం
- టీఎన్జీవో, టీజీవో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని టీజేఎస్ చీఫ్ కోదండరాం అన్నారు. గురువారం నాంపల్లి టీఎన్జీవో భవన్‌లో టీఎన్జీవో హైదరాబాద్ సిటీ 2026 డైరీ, క్యాలెండర్‌ను కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పెన్ డౌన్, ధర్నాలు, ర్యాలీలు చేసి కీలక పాత్ర పోషించారన్నారు.
ఏప్రిల్ నుంచి ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టీజీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్, సిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, హరికృష్ణ, కస్తూరి వెంకట్ పాల్గొన్నారు.
స్కీమ్‌ల అమలులో ఉద్యోగులే కీలకం: స్పీకర్
ప్రభుత్వ స్కీమ్ అమలు, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరడంలో ఉద్యోగులే కీలకం అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం అసెంబ్లీలో టీజీవో హైదరాబాద్ సిటీ 2026 క్యాలెండర్, డైరీని స్పీకర్ రిలీజ్ చేశారు. కార్యక్రమంలో టీజీవో కేంద్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, శ్యామ్, హైదరాబాద్ సిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండూరి వెంకట్ పాల్గొన్నారు.
