నల్గొండ అర్బన్, వెలుగు: న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని నల్లగొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, మంద నగేశ్కోరారు. అడ్వకేట్నరేశ్ ఇంటిపై దాడిని ఖండిస్తూ గురువారం విధులు బహిష్కరించి, కోర్టు సముదాయం నుంచి క్లాక్టవర్వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదులు వెంకటేశ్వర్లు, ఠాగూర్, భాస్కర్ రెడ్డి, నాగిరెడ్డి, కిశోర్ కుమార్, శేఖర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల విధుల బహిష్కరణ
హుజూర్ నగర్: హుజూర్ నగర్ లో గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. నల్గొండ బార్ అసోసియేషన్ సభ్యుడు, అడ్వకేట్ నరేశ్ కుటుంబసభ్యులపై దుండగుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాల్వ శ్రీనివాసరావు, చనగాని యాదగిరి, ఎంఎస్.రాఘవరావు, ఉప్పల గోపాలకృష్ణమూర్తి, జక్కుల వీరయ్య పాల్గొన్నారు.
