పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి

పవన్ కళ్యాణ్  సెక్యూరిటీపై దాడి

హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో  దారుణం జరిగింది.  నటుడు పవన్ కళ్యాణ్  పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ ఇంటిపై పలువురు దాడి చేశారు. ఇంటి పైన రాళ్లు, రాడ్లు , కతులతో దాడి చేసి  సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.  పాత కక్షల  నేపథ్యంలో   రాజు అనే వ్యక్తి  వెంకట్ ఇంటి ముందు ఉన్న బైక్ ను  తగలబెట్టి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. బైక్ ను ధ్వంసం చేసి  అతని పై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. 

వెంకట్ తన భార్య సరితతో కలసి ఐదు సంవత్సరాలుగా ఇద్దరు పిల్లలతో కలిసి లెనిన్ నగర్ లో నివసిస్తున్నాడు.  ఇంటి ఎదురుగా ఉండే రాజు వాళ్ల  బంధువులు  పాత గొడవల నేపథ్యంలో మే 15న రాత్రి  వెంకట్ కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో  వెంకట్ భార్య సరిత  అబ్బాయిని కొట్టింది. దీంతో  రాజు బంధువు  వెంకట్ ఇంటిపై  కర్రలు ఇటుకలు,  ఇనుప రోడ్లతో  దాడి చేసి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.  వెంకట్ కుటుంబ సభ్యుల పై దాడికి పలుపడ్డారు. ఈ వివాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు  మీర్ పేట్  పోలీసులు.