తెలంగాణలో మహిళ రక్షణ కరువు...సంకినేని వెంకటేశ్వరరావు

తెలంగాణలో మహిళ రక్షణ కరువు...సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట,  వెలుగు: తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.  వచ్చే ఎన్నికల్లో మహిళలు బీజేపీని ఆశీర్వదించి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.  మంగళవారం బీజేపీ మహిళా మోర్చా సూర్యపేట పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బూర శకుంతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని,  కానీ మహిళలకు న్యాయం మాత్రం జరగడం లేదని ఆరోపించారు.

ప్రజలను మద్యానికి బానిస చేసి మద్యంపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి గత ప్రభుత్వాలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేదని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక మహిళల ఆర్థిక భద్రతను గాలికి వదిలేశారన్నారు.  మహిళలు చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ఇన్​చార్జి కరణం పరిణిత, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు అయినాపురపు శ్యామల గౌరి, కౌన్సిలర్లు సలిగంటి సరిత, పలస మహాలక్ష్మి, పట్టణ నాయకురాలు నాగారపు మనేమ్మ, గరిగంటి సమత, దోసకాయల మౌనిక, మీరు పర్వీన్ పాల్గొన్నారు.