- బీజేపీ నేత ఎన్వీ సుభాష్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) పై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ మండిపడ్డారు. ఖర్గే తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ను విషసర్పమని ఖర్గే మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ముస్లింలు తమ నమాజ్ పక్కనపెట్టి అయినా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై దాడులు చేయాలని, వారిని చంపాలని ఖర్గే పిలుపునివ్వడం విద్వేషపూరిత ప్రసంగం కిందకే వస్తుందని పేర్కొన్నారు.
