హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారిగా బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్‌తో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ ఫోన్ కాల్‌తో వెంటనే స్పందించిన మెట్రో అధికారులు, పోలీసులు, అప్రమత్తమయ్యారు. హుటాహుటిన స్టేషన్‌కు చేరుకున్న పోలీసులు, మెట్రో ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్ సభ్యులు.. స్టేషన్ అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి మూలను ప్రయాణికుల బ్యాగులను నిశితంగా పరిశీలిస్తున్నారు. అసలు ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆకతాయిల పనా లేక మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రయాణికులు ఆందోళన చెందవద్దని, భద్రతా సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు."
►ALSO READ | డయాబెటిస్ లో కొత్త రకం : లక్షల మందికి తప్పుడు చికిత్స జరుగుతోందని నిపుణుల హెచ్చరిక!

