V6 News

కట్ట మైసమ్మ బోనాలకు ఏర్పాట్లు పూర్తి

కట్ట మైసమ్మ బోనాలకు ఏర్పాట్లు పూర్తి

ముషీరాబాద్/మెహిదీపట్నం/పద్మారావునగర్, వెలుగు: లోయర్ ట్యాంక్ బండ్​ కట్ట మైసమ్మ ఆలయంలో ఈ నెల 16,17 తేదీల్లో జరగనున్న బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.సిటీ నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ వ్యవస్థాపక మెంబర్ గౌతమ్ కుమార్, ఈవో సాంబశివరావు తెలిపారు. ఆదివారం ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. 

17న రంగం, పోతరాజుల విన్యాసం ఉంటుందని తెలిపారు. అనంతరం బోనాల ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను వారు రిలీజ్ చేశారు. గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్,   మధురానగర్​లోని బంగారు మైసమ్మ అమ్మవారిని ఆలయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు దర్శించుకున్నారు.