V6 News

హార్ముజ్ జలసంధి తెరిచిన ఇరాన్..చమురు కష్టాలనుంచి భారీ ఊరట!

హార్ముజ్ జలసంధి తెరిచిన ఇరాన్..చమురు కష్టాలనుంచి భారీ ఊరట!

హార్ముజ్ జలసంధిలో చమురు నౌకలు రాకపోకలపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని చమురు నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపింది.  ఇజ్రాయెల్, లెబనాన్ కాల్పుల విమరణతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇరాన్ ప్రకటనతో భారత్ తోపాటు చమురు కష్టాలను ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు భారీ ఊరట లభించింది. 

ఇజ్రాయెల్, లెబనాన్  మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత హార్ముజ్ తెరిచేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది.కాల్పుల విరమణ కాలంలో హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్అరాఘ్చీ సోషల్  మీడియా ప్లాట్ ఫాం X ద్వారా తెలిపారు. 

ఇజ్రాయెల్, లెబనాన్ లు 10 రోజులు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఈ ప్రకటన చేసింది. వాషింగ్టన్ లో జరిగిన సమావేశంలో ఇజ్రాయెల్, లెబనాన్ కాల్పుల విరమణకు ఒప్పుకోవడంతో గత కొన్ని వారాలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరపడింది. ఇదే విషయాన్ని లెబనాన్ అధ్యక్షుడు కూడా ప్రకటించారు. 

ప్రపంచ చమురు రవాణా మార్గాలలో హార్ముజ్  అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ఈ జలసంధి ద్వారా  ఎక్కువ భాగం చమురు, గ్యాస్ రవాణా జరుగుతోంది. ఇరాన్  ప్రకటనతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ ఊరట లభించనుంది.  చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.