V6 News

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కేకేఆర్.. 

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కేకేఆర్.. 

ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్, మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించి గుజరాత్ పై ఒత్తిడి పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. కేకేఆర్ బ్యాటింగ్ లైనఫ్ ని దెబ్బకొట్టి తక్కువ స్కోర్ కే పరిమితం చేయాలని గుజరాత్ టైటాన్స్ ప్లాన్ చేస్తుంది. 
 
కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మాట్లాడుతూ.. మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం.. మా బ్యాటర్లు ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడాలని కోరుకుంటున్నాం.. టీ20 ఫార్మాట్ అంతా మొమెంటం మీద ఆధారపడి ఉంటుంది.. ఫిన్ అలెన్ స్థానంలో టిమ్ సీఫెర్ట్ తుది జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు. 

గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం.. మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉంది.. గత మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ విఫలమైంది, లేదంటే అది ఈజీ ఛేజింగ్ అయ్యేది అని తెలిపాడు.  చిన్న చిన్న విషయాలని మేము టీమ్ మీటింగ్ లో చర్చించుకుని బరిలోకి దిగుతామని చెప్పాడు. ఈ మ్యాచ్ కి పాత జట్టులోకి వస్తున్నట్లు వెల్లడించాడు. 
 
జట్లు:
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

కోల్‌కతా నైట్ రైడర్స్: టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి