V6 News

జియో ధమాకా ఆఫర్: ఒకే రీఛార్జ్‌తో ఐపీఎల్, హాట్‌స్టార్, 5G డేటా ఫ్రీ.. ఫ్రీ.. కస్టమర్లకు పండగే

 జియో ధమాకా ఆఫర్: ఒకే రీఛార్జ్‌తో ఐపీఎల్, హాట్‌స్టార్, 5G డేటా ఫ్రీ.. ఫ్రీ..  కస్టమర్లకు పండగే

 టెలికాం  దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను  తీసుకొచ్చింది. ముఖ్యంగా ఐపీఎల్ చూసేవారికి, ఎక్కువ డేటా వాడేవారికి ఇవి చాలా ప్లస్ అవుతాయి. 

జియో రూ. 999 ప్లాన్ తో 3 నెలల పాటు టెన్షన్ లేకుండా లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ కావాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీని  వ్యాలిడిటీ 98 రోజులు అంటే దాదాపు 3 నెలలకు పైగానే. డేటా పరంగా చూస్తే  ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాతో మొత్తం 196GB లభిస్తుంది. ఒకవేళ మీ ఏరియాలో 5G ఉంటే, మీరు  Unlimited 5G డేటా వాడుకోవచ్చు. ఆన్ లిమిటెడ్ కాల్స్ & రోజుకు ఎస్ఎంఎస్ లు   100 లభిస్తాయి.

పెద్ద ఆఫర్ ఏంటంటే  3 నెలల పాటు జియో-హాట్‌స్టార్ ఉచితం ఇస్తుంది. దింతో  ఐపీఎల్ మ్యాచ్‌లు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎంజాయ్ చేయొచ్చు. బోనస్ కింద 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్‌స్క్రిప్షన్, 5 వేల GB క్లౌడ్ స్టోరేజ్ పొందొచ్చు. 

జియో రూ. 339 ప్లాన్ అనేది  తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ లాభం పొందాలనుకునేవారి కోసం. నెలకు ఒకసారి రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది. దీని వ్యాలిడిటీ 30 రోజులు, రోజుకు 1.5GB డేటా,  ఆన్ లిమిటెడ్ కాల్స్ &  ఇంకా 100 ఎస్ఎంఎస్ అందిస్తుంది. 
ఇంకా రూ. 14.95 టాక్ టైమ్ కూడా లభిస్తుంది. బోనస్ కింద ఇంత తక్కువ ధరకే  మీకు 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్, జియో టీవీ, ఏఐ క్లౌడ్ సేవలు లభిస్తాయి.

ఏ ప్లాన్ బెస్ట్ అంటే 
మీరు క్రికెట్ అభిమాని అయితే లేదా ఎక్కువగా  సినిమాలు చూసే వారైతే రూ. 999 ప్లాన్ తీసుకోవడం చాలా బెనిఫిట్ ఉంటుంది. పదే పదే రీఛార్జ్ చేసే తలనొప్పి ఉండదు, పైగా అదనపు డేటా, హాట్‌స్టార్ ఫ్రీగా వస్తాయి. కేవలం ఒక నెల అవసరాల కోసం అయితే రూ. 339 ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.