18 ప్రిన్సిపుల్స్ ఫర్ సక్సెస్ పుస్తకావిష్కరణ

18 ప్రిన్సిపుల్స్ ఫర్ సక్సెస్ పుస్తకావిష్కరణ

బషీర్​బాగ్, వెలుగు: విద్యార్థుల లక్ష్యసాధనకు అవసరమైన మార్గదర్శకాలను అందించే ‘18 ప్రిన్సిపుల్స్ ఫర్ సక్సెస్ ఇన్ ఎగ్జామ్స్’ పుస్తకాన్ని ప్రముఖ పీడియాట్రిషియన్ డా. గుండ్లూరు సురేంద్ర బాబు రచించారు. ఇంగ్లీష్ వెర్షన్ పుస్తకాన్ని శుక్రవారం నాంపల్లిలోని తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళావేదికలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. ఏనుగు నరసింహారెడ్డి ఆవిష్కరించారు.  

ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పరీక్షల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, జ్ఞాపకశక్తిని పెంచుకునే ఆధునిక చిట్కాలు, భవిష్యత్ ప్రణాళిక, ఆరోగ్య రక్షణ, ఆహారపు అలవాట్లతో పిల్లలతోపాటు తల్లిదండ్రులకు కూడా ఈ పుస్తకం మార్గదర్శిగా ఉపయోగపడుతుందని  తెలిపారు.