వచ్చే అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌.. డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్కూల్ పాయింట్లకే పుస్తకాలు!

వచ్చే అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌.. డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్కూల్ పాయింట్లకే పుస్తకాలు!

 

  • వచ్చే అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి అమలుకు యోచన
  • టెక్ట్స్ బుక్స్​ పంపిణీలో జాప్యం నివారణకు విద్యాశాఖ చర్యలు 
  • త్వరలోనే సర్కారుకు ప్రతిపాదనలు పంపించనున్న ఆఫీసర్లు 
  • ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు చేరుతున్న బుక్స్​
  • అక్కడినుంచి మండల, స్కూల్ పాయింట్లకు 

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందించే పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్కూల్ పాయింట్లకే పుస్తకాలను చేరవేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం పుస్తకాలను రాష్ట్రంలోని ముద్రణ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మండల కేంద్రాలకు, ఆ తర్వాత స్కూళ్లకు చేరవేసే ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నది. దీన్ని నివారించేందుకు పంపిణీ విధానాన్ని సులభతరం చేసేలా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో గవర్నమెంట్, లోకల్ బాడీ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లతోపాటు గురుకులాల్లో చదివే విద్యార్థులు 24 లక్షలకు పైగా ఉండగా, వారందరికీ కోటిన్నర పుస్తకాలు అవసరం.  బరువు తగ్గించేందుకుగానూ రెండేండ్లుగా పాఠ్య పుస్తకాలను 2 పార్టులుగా విభజించి, 2 విడతల్లో సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో  జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్కూళ్లు ప్రారంభంనాటిని తొలివిడత బుక్స్​ చేరుతున్నాయి.  కానీ, రెండో విడతలో మాత్రం సకాలంలో స్కూళ్లకు చేరడం లేదని అధికారుల దృష్టికి వచ్చింది. దీనికితోడు ప్రస్తుతం పంపిణీ వ్యవస్థ సరిగా లేదని విద్యాశాఖ గుర్తించింది. స్టేట్​ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి జిల్లా కేంద్రాలకు.. అక్కడి నుంచి మండల, ఎమ్మార్సీ కేంద్రాలకు.. అక్కడి నుంచి స్కూల్ పాయింట్లకు పుస్తకాలను చేరవేస్తున్నారు. దీనివల్ల ఖర్చుతో పాటు రవాణా సమయం కూడా ఎక్కువ అవుతున్నది. దీని నివారణకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సర్కారుకు త్వరలో ప్రతిపాదనలు 

పుస్తకాల పంపిణీ వ్యవస్థ బలోపేతంపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో పుస్తకాలను స్కూల్ పాయింట్లకు తీసుకుపోతూ.. ఆటో బోల్తా పడి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సీరియస్ అయ్యారు. పలువురిపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రెండో విడత పుస్తకాల పంపిణీలో జాప్యంపై ఆరా తీశారు. పలువురు డీఈవోలు, అధికారులతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడి, వివరాలు సేకరించారు. ఈ క్రమంలో నేరుగా స్కూల్ పాయింట్లకు బుక్స్​ పంపిణీ చేయాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే, ఏకంగా 24 వేల స్కూల్ పాయింట్లకు పంపిణీ కొంత ఇబ్బందిగా ఉండే అవకాశమూ లేకపోలేదు. దీంతో స్కూల్ పాయింట్లతోపాటు మండల పాయింట్లకు పుస్తకాల పంపిణీ అంశాన్ని సర్కారుకు ప్రతిపాదించాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. ఒకవేళ మండల పాయింట్లవరకూ సరఫరాకు సర్కారు ఆమోదం తెలిపితే.. పలు జిల్లాల్లో స్కూల్ పాయింట్ల వరకూ పుస్తకాల పంపిణీని పైలట్ ప్రాజెక్టు కింద చేయాలనే యోచనలో విద్యాశాఖ అధికారులున్నారు.