విధుల్లో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

విధుల్లో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

లండన్ : బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ మళ్లీ విధులకు హాజరయ్యారు. కరోనా సోకటంతో ఐసీయూలో ట్రీట్ మెంట్ తీసుకున్న ఆయన రెండు వారాల తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు వచ్చారు. బ్రిటన్ లో కరోనా పరేషాన్ చేస్తుండటంతో విధుల్లోకి రాగానే కరోనా పరిస్థితిపై సమీక్షించారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. కరోనా లక్షణాలుండటంతో మార్చి 26 న బోరిస్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కరోనా టెస్ట్ లు చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయనకు ఐసీయూలో ట్రీట్ మెంట్ ఇచ్చారు. కరోనా సోకిన తొలి దేశాధినేత బోరిస్ జాన్సనే. మూడు రోజుల పాటు ఐసీయూలో ట్రీట్ మెంట్ తర్వాత ఏప్రిల్ 12 ఆయన పూర్తిగా కోలుకున్నారు. రెండు వారాల పాటు అబ్జర్వేషన్ తర్వాత ఆయన మళ్లీకి విధుల్లోకి చేరారు.