V6 News

ఢిల్లీ తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంబేద్కర్ జయంతి

 ఢిల్లీ తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంబేద్కర్ జయంతి

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్135వ జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ శశాంక్ గోయెల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకుంటూ, సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయడమే మనం అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని, ఆయన యావత్ దేశానికి గర్వకారణమని ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయెల్ కొనియాడారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అసాధారణ ప్రతిభతో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయన జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.