
మెదడు.. చాలా సున్నితమైన అవయవం. అలాంటి మెదడుకు ఆపరేషన్లు చేయడమంటే కష్టమైన పని. అయితే, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ (ఐవోఎన్ ఎం) విధానంతో మెదడు ఆపరేషన్లనూ సులువుగా, సురక్షితంగా చేయొచ్చని యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ విధానంలో పేషెంట్ కు మత్తు ఇవ్వకుండానే ఆపరేషన్ చేయొచ్చని, పేషెంట్ కూడా మానిటర్ లో ఆపరేషన్ తీరును చూడొచ్చని ఆయన చెప్పారు.
తొలిసారిగా సికింద్రాబాద్ లోని యశోద హాస్పి ట్ లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో ఫిజియాలజీ, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరో సర్జికల్ సొసైటీలు సంయుక్తంగా ఐవోఎన్ ఎం లైవ్ వర్క్‌షాప్ ను ప్రారంభించాయి. ఈ వర్క్‌షాపుకు 200 మందికిపైగా దేశ విదేశీ నిపుణులు హాజరయ్యారు. ఐవోఎన్ ఎం వచ్చాక మెదడులోని ట్యూమర్లను (గడ్డలు) ఈజీగా తొలగించగలుగుతున్నామని డాక్టర్ ఆనంద బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. రెండేళ్లలో ఇలాంటి 200కుపైగా న్యూరో సర్జీలను చేశామన్నారు. ఈ విధానం ద్వారా ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను వర్క్షాపుకొచ్చిన నిపుణులకు పరిచయం చేశారు.