
జిన్నారం, వెలుగు: ఆధార్ కార్డు తరహాలో రైతులకు భూముల వివరాలతో కూడిన భూధార్ కార్డులు ఇస్తామని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరి అన్నారు. భూభారతి చట్టం ద్వారా నిర్ణీత సమయంలో భూ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. బుధవారం జిన్నారం మండల కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కొత్త చట్టం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను పవర్పాయింట్ప్రజెంటేషన్ద్వారా వివరించారు.
అధికారులు గ్రామాలకు వచ్చి, అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. దరఖాస్తుదారులు ఆఫీస్ల చుట్టూ తిరగకుండా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు రాకుండా వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎవరైనా మోసపూరితంగా హక్కుల రికార్డులు తయారు చేసి, ప్రభుత్వ, భూదాన్, దేవాదాయ, అసైన్డ్, వక్ఫ్ భూములుకు పట్టాలు పొందితే వాటిని రద్దు చేసే అధికారం భూభారతి చట్టం అధికారులకు కల్పించిందని తెలిపారు.
వడ్ల కొనుగోలు కేంద్రం తనిఖీ
జిన్నారం మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్క్రాంతి వల్లూరి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. అడిషనల్కలెక్టర్ మాధురి, డీఏవో శివప్రసాద్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో అరుణ రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ జిన్నారం మండల అధ్యక్షుడు కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.