అమెరికాలోని టెక్సా్స్ లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో మృతిచెందిన వారిలో భారతీయ సంతతి విద్యార్థిని కూడా ఉన్నారు.టెక్సాస్ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ , ఎకనామిక్స్ చదువుతున్న భారతీయ సంతతికి చెందిన సవిత షాన్ గా గుర్తించారు. దుండగుడి కాల్పుల్లో మొత్తం ముగ్గరు చనిపోగా 14 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు చనిపోయాడు. ఈ కాల్పుల ఘటనలో ఇరాన్ హస్తం ఉందేమోనని ఎఫ్‌బీఐ వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి.
అయితే ఈ ఘటనలో ఉగ్రకుట్ర ఉన్నట్లు అమెరికా ఇన్వెస్టిగేటివ్ సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుమానిస్తోంది. ఈ కాల్పులకు అమెరికా ,ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దాడి జరిగిన సమయంలో అనుమానితుడు ఇరానియన్ జెండా డిజైన్ ఉన్న దుస్తులు ,మతపరమైన నినాదాలు చేసినట్లు తెలుస్తోంది.
ఆదివారం ఆస్టిన్‌లోని పేరున్న బ్యూఫోర్డ్‌లోని ఓ బార్ వెలుపల కారులో వచ్చిన దుండగుడు వారిపైకి కాల్పులకు దిగాడు. మృతులను సవితా షణ్ముగసుందరం, రైడర్ హారింగ్టన్, జోర్జ్ పెడెర్సన్‌లుగా గుర్తించారు. దుండగుడిని సెనెగల్‌లో జన్మించిన 53 ఏళ్ల ఎన్‌డిగా డియాగ్నెగా గుర్తించారు.
టూరిస్టు వీసాపై వచ్చిన ఎన్‌డిగా డియాగ్నెగా అమెరికా పౌరురాలిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇతడికి పౌరసత్వం కూడా వచ్చిందని అమెరికా దర్యాప్తు సంస్థ FBI అధికారులు వెల్లడించారు. ఇతడి ఇంట్లో జరిపిన సోదాల్లో ఇరాన్ జాతీయ పతాకం, ఇరాన్ నేతల ఫొటోలు కొన్ని లభించాయి. అతడు ధరించిన టీ షర్టుపై ఇరాన్ జెండా డిజైన్, ప్రాపర్టీ ఆఫ్ అల్లాహ్ అని రాసి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
The family of 21-year-old Savitha Shan, one of the students at UT Austin who was tragically killed in the mass shooting at a downtown Austin bar early Sunday, has put out the following statement, and shared with us this photo of her.@cbsaustin pic.twitter.com/dM5SZDGhh8
— Vinny Martorano (@VinnyMartorano) March 3, 2026
