శ్మశానవాటిక దారి కబ్జా చేశారంటూ దీక్ష

శ్మశానవాటిక దారి కబ్జా చేశారంటూ దీక్ష

జమ్మికుంట, వెలుగు: మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 793/A/2, 793/Bలోని  ప్రభుత్వ భూమిలో గల శ్మశానవాటిక దారిని ఎంపీఆర్ గార్డెన్స్ యజమాని కబ్జా చేసి, గోడ నిర్మించారని జమ్మికుంట పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్ ఆరోపించాడు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపట్టాడు. తహసీల్దార్ కు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వ భూమి అని నిర్ధారించినప్పటికీ సదరు యజమాని ఆ స్థలాన్ని వదలడం లేదన్నాడు. శ్రీకాంత్​దీక్షకు పలువురు సంఘీభావం తెలిపారు.