గోదావరిఖని, వెలుగు: కాకా వెంకటస్వామి ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ ఆయన మనువడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. కాకా వర్ధంతి సందర్భంగా గోదావరిఖని జీఎం ఆఫీస్ మూలమలుపు వద్ద గల కాకా విగ్రహానికి ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ లీడర్లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి, రాష్టానికి కాకా చేసిన సేవలను కొనియాడారు. నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను ఆర్థికంగా ఆదుకునేందుకు కాకా ఎంతగానో కృషి చేశారన్నారు. తెలంగాణకు సాగు, తాగునీటిని అందించేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించారన్నారు.
