అయిజ, వెలుగు: గట్టు మండలం తప్పెట్లమొర్సు గ్రామ రైతులు పంట పొలాల్లో ఆరబెట్టిన మిర్చిని దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన రైతులు చింతలకుంట నరసింహులు, పరమేశ్ అయిజ మండలం దేవబండ శివారులోని వారి పంట పొలాల్లో మిర్చిని ఆరబెట్టారు.
ఆదివారం సాయంత్రం వరకు కుటుంబసభ్యులతో అక్కడే పని చేసి రాత్రి ఇంటికి చేరుకున్నారు. సోమవారం కల్లం దగ్గరికి వెళ్లి చూడగా, మిర్చి చెల్లాచెదురుగా పడి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బ్యాడిగి రకం మిర్చి 5 క్వింటాళ్ల వరకు ఎత్తుకెళ్లారని, దీని విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు.
