మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: భారతరత్న, బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం పోరాడాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు పిలుపునిచ్చారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జాతీయ ఎంబీసీ ఆత్మగౌరవ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్లకు ఆధ్యుడిగా బిహార్ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కర్పూరి ఠాకూర్ కొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తూ రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
విజయకుమార్, బెక్కం జనార్ధన్, శ్రీనివాస్ సాగర్, కోరమోని వెంకటయ్య, రవి ముదిరాజ్, వెంకటస్వామి, సత్యశీల సాగర్, వెంకటేశ్ గౌడ్, ఆంజనేయులు, దుర్గేశ్, బుగ్గన్న, డీకే నాయి, అశ్విని సత్యం, ఫకీర్ జహంగీర్ భాషా, బాలరాజు, నరసింహులు, మల్లేశ్, వెంకట్రాములు పాల్గొన్నారు.
