అట్టహాసంగా జీపీ పాలకవర్గాల ప్రమాణస్వీకారం

అట్టహాసంగా జీపీ పాలకవర్గాల ప్రమాణస్వీకారం

కొడిమ్యాల/గంగాధర/జగిత్యాల రూరల్‌‌‌‌, వెలుగు: ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు మెంబర్లు సోమవారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో గడ్డం జీవన్ రెడ్డి, డబ్బుతిమ్మాయపల్లిలో సురకంటి లావణ్య ముత్యంరెడ్డి, పూడూరు గ్రామంలో కడారి మల్లేశం, నమిలి కొండ గ్రామంలో షాబొద్దీన్, చెప్యాల గ్రామంలో ఉట్టూరి శ్రీలత శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శ్రీరాములపల్లి సర్పంచ్ కోరండ్ల స్వప్న- నరేందర్​రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

 ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. దీంతోపాటు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాసారం, సర్వారెడ్డిపల్లి గ్రామాల్లో సర్పంచులు వేముల జ్యోతి దామోదర్‌‌‌‌‌‌‌‌, కరబూజ తిరుపతి గౌడ్‌‌‌‌, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. జగిత్యాల రూరల్ మండలం, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించారు. చల్ గల్ గ్రామంలో జున్ను రాజేందర్, తిమ్మాపూర్ లో ఏలేటి మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.