కారేపల్లి, వెలుగు: మహిళలు సర్పంచులుగా ఎన్నికైన గ్రామాల్లో వారి భర్తలు సర్పంచులుగా చెప్పుకోవద్దని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. మండలంలోని అప్పాయిగూడెం రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
మండలంలో 41 మంది సర్పంచులకు 31 మంది హాజరై 10 మంది హాజరు కాకపోవడం వీరిలో కొందరు మహిళా సర్పంచుల స్థానంలో వారి భర్తలు హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలకు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
