కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో బకాయి ఉన్న సీఎంఆర్ ను సంబంధిత మిల్లులు వెంటనే చెల్లించాలని లేదంటే ఆర్ఆర్యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ విక్టర్ శుక్రవారం తెలిపారు. 2021–-22 ఖరీఫ్, 2022–-23 ఖరీఫ్, 2023–-24 రబీ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ బకాయి 56 మిల్లులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటి బకాయి 39,362 టన్నులు. 25 శాతం జరిమానాతో 49,203 టన్నులు.
ఇప్పటి వరకు 28 రైస్ మిల్లుల నుంచి 14,120 టన్నులు వసూలు చేశామన్నారు. మిగిలిన 35, 082 టన్నులు సుమారు రూ.126 కోట్ల విలువైన సీఎంఆర్రావాల్సి ఉందన్నారు. 4 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, ఇంకా 21 మిల్లులపై కేసుల నమోదుకు పీఎస్‌లలో ఫిర్యాదులు ఇచ్చామన్నారు.
