సాధారణంగా శాంసంగ్ టాప్-ఎండ్ ఫోన్లను ప్రతి ఏడాది జనవరిలో విడుదల చేస్తుంది. కానీ Samsung Galaxy S26 సిరీస్ లాంచ్ ఈసారి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది, అంతేకాదు కంపెనీ ఈ లాంచ్ ఈవెంట్‌ను ఫిబ్రవరికి వాయిదా వేయవచ్చని, ఇంకా 2026లో మార్కెట్లో రాబోతున్న Galaxy S26 Ultra లాంచ్ తేదీపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు దక్షిణ కొరియా సమాచారం ప్రకారం కంపెనీ వచ్చే ఏడాది చివరిలో లాంచ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.
ఒకవేళ గెలాక్సీ S26 అల్ట్రా ఇతర మోడళ్లను ఫిబ్రవరిలో ప్రకటిస్తే కొత్త మోడల్స్ సేల్స్ ఫిబ్రవరి చివరకు లేదా వచ్చే మార్చి ప్రారంభంలో ఉండే అవకాశం ఉంది. బార్సిలోనాలో జరిగే అతిపెద్ద మొబైల్ ఈవెంట్ (MWC 2026) సమయంలోనే శాంసంగ్ ఈ ఫోన్లను పరిచయం చేసే ఛాన్స్ కూడా ఉంది.
ఈ ఫోన్‌లో ఏ ప్రాసెసర్ వాడాలనే విషయంలో శాంసంగ్ చివరి నిమిషం వరకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే కంపెనీ సొంత Exynos 2600 చిప్‌ను వాడాలా లేదా శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 5 వాడాలా అనే ఆలోచనలో ఉంది.
మెమరీ చిప్స్ ధరలు పెరగడం వల్ల, ఫోన్ తయారీ ఖర్చు ఎక్కువ అవుతోంది. ఐఫోన్‌తో పోటీ పడాలంటే ధరను అందుబాటులో ఉంచడం శాంసంగ్ కి సవాలుగా మారింది. మొదట్లో 'ప్రో' మోడల్ వంటి కొత్త రకాలను తేవాలనుకున్నా, ప్రస్తుతానికి పాత మోడల్స్ S26, S26+, S26 Ultraనే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
దీనితో పాటు, శామ్సంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ పై కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది, దీనిని వచ్చే ఏడాది చివర్లో ఐఫోన్ ఫోల్డ్ ఎంట్రీ సందర్భంగా ప్రకటించవచ్చు. ఈ మోడల్ 7.6-అంగుళాల లోపలి స్క్రీన్‌తో పాటు చిన్న 5.4-అంగుళాల కవర్ డిస్ ప్లేతో ఉంటుందని చెబుతున్నారు. వెడల్పు పరంగా ఇది చూడటానికి పాస్‌పోర్ట్ ఆకారంలో వెడల్పుగా ఉంటుంది.
