జగిత్యాలలో యావర్‌‌‌‌‌‌‌‌ రోడ్డును విస్తరించండి..సీఎంను కలిసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాలలో యావర్‌‌‌‌‌‌‌‌ రోడ్డును విస్తరించండి..సీఎంను కలిసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

 జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాలలోని యావర్ రోడ్డును విస్తరించాలని, అప్పుడే తాను రాజకీయాల్లో కొనసాగుతానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌లోని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. యావర్ రోడ్డు విస్తరణ ప్రాముఖ్యతను వివరించారు. 2001కు ముందు 80 ఫీట్లుగా ఉన్న రోడ్డు  2021లో 100 ఫీట్లరోడ్డు తో కమర్షియల్ జోన్ గా మారిందన్నారు.

 గతంలో 30 ఫీట్ల నుంచి 80 ఫీట్ల రోడ్డుగా ఉన్నప్పుడు అనుమతి పొంది నిర్మించిన ఇండ్లను తొలగించాలంటే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఆయన.. రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ సెక్రటరీని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

జగిత్యాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం మంజూరు అయిందని, 10 ఎకరాల్లో మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి స్థల సమస్య ఉందన్నారు. యావర్‌‌‌‌‌‌‌‌ రోడ్డు విస్తరణకు సానుకూలంగా స్పందించిన సీఎంకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.