బొగ్గు గనుల వేలంతో ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం

బొగ్గు గనుల వేలంతో ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం

గోదావరిఖని, వెలుగు: బొగ్గు గనుల వేలంతో ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం జరుగుతోందని సీఐటీయూ  రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి వాపోయారు. సోమవారం గోదావరిఖని ప్రెస్​ క్లబ్‌‌‌‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బొగ్గు గనులను ప్రైవేటు వారికి కట్టబెట్టేలా తెచ్చిన వేలం విధానం వల్ల సింగరేణికి, కోల్ ఇండియాకు భవిష్యత్తు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

తాజాగా మణుగూరులోని పీకేఓసీ డిప్​సైడ్ ఎక్స్టెన్షన్ టూ బ్లాక్​ను వేలంలో చేర్చినట్లు చెప్పారు. వేలంలో పాల్గొన్న సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, అందువల్ల తమ వంతు బాధ్యతగా ఆ సంస్థలను హెచ్చరించి బిడ్డింగ్​లో పాల్గొనకుండా చూడాలన్నారు.