కోరుట్ల, వెలుగు: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని, అవి అభివృద్ధి పథంలో సాగితేనే దేశ ప్రగతి సాధ్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
సర్పంచ్, పాలకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సేవ చేయాలన్నారు. కార్యక్రమంలో తాండ్రియాల సర్పంచ్జంగ శివాని, ఉప సర్పంచ్ అల్లూరి జనార్ధన్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వేములవాడరూరల్, వెలుగు: వేములవాడ రూరల్ మండలం వట్టెంల, లింగంపల్లి గ్రామాల పాలకవర్గాల ప్రమాణస్వీకారానికి విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచులు రంగు వెంకటేశంగౌడ్, సామ తిరుపతిరెడ్డిని సన్మానించారు.
అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులను చూసి గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసయాలని సూచించారు.
