- సెంట్రల్ ప్రభారీ స్వప్న దేవి రెడ్డి
మహబూబ్నగర్, వెలుగు: నర్వ ఆస్పరేషన్ బ్లాక్ సూచికల ప్రకారం కొన్ని గణాంకాలు సరిగా నమోదు కాలేదని సెంట్రల్ ప్రభారీ స్వప్న దేవి రెడ్డి పేర్కొన్నారు. డేటా, సాఫ్ట్ వేర్ లో ఏమైనా సాంకేతిక లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు.
నారాయణపేట జిల్లాలోని నర్వ యాస్పరేషన్ బ్లాక్ ప్రాజెక్ట్ ప్రగతిపై సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాలులో ఇన్చార్జికలెక్టర్ సంచిత్ గాంగ్వర్ తో కలిసి సెంట్రల్ ప్రభారీ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా నర్వ ఆస్పరేషన్ బ్లాక్లో ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక, మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధిరంగాల్లో కీలకమైన ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్(ఏబీపీ) సూచికల ప్రకారం ఇప్పటి వరకు చేసిన వివిధ అభివృద్ధి పనులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాయిల్ హెల్త్ కార్డులో ఏ సూచికలు ఉంటాయని డీఏవోను అడిగి తెలుసుకున్నారు. బ్లాక్లో నిర్దేశించిన మిగిలిన అన్ని సూచికల్లో వంద శాతం లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డీఆర్డీవో మొగులప్ప, డీఏవో జాన్ సుధాకర్, డీపీవో సుధాకర్ రెడ్డి, డీఎంహెచ్వో జయ చంద్రమోహన్, డీఈవో గోవిందరాజులు, నోడల్ ఆఫీసర్ హీర్యా నాయక్, నర్వ తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, యాస్పరేషన్ బ్లాక్ సమన్వయకర్త బాలాజీ పాల్గొన్నారు.
