కోఆర్డినేషన్ తో పని చేస్తేనే సక్సెస్ సాధ్యం : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

కోఆర్డినేషన్ తో పని చేస్తేనే సక్సెస్ సాధ్యం :  కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

గద్వాల, వెలుగు : ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు కోఆర్డినేషన్ తో పని చేస్తేనే ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సక్సెస్ అవుతుందని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కౌన్సిలర్లు, సర్పంచ్ లకు ఏర్పాటుచేసిన ఒకరోజు శిక్షణ శిబిరాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు పథకాలను అర్హులైన వారందరికీ అందించేందుకు సహకరించాలని కోరారు.