నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి సూచించారు. గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని 18వ వార్డులో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు వైద్య సేవలు అందించాలన్నారు. మండలంలోని నాగదేవ్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్ పర్సన్ తీగల సునేంద్ర ఉన్నారు.
