పాలమూరులో కాకా వెంకటస్వామికి ఘన నివాళి

పాలమూరులో కాకా వెంకటస్వామికి ఘన నివాళి

మహబూబ్ నటర్ టౌన్/నాగర్​కర్నూల్​టౌన్, వెలుగు: మాజీ కేంద్రం మంత్రి కాకా వెంకటస్వామి11వ వర్ధంతి, మాల మహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు 20వ వర్ధంతిని సోమవారం పాలమూరులో జరుపుకున్నారు. అంబేద్కర్  చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో వారి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుగడ్డ యాదయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి మిట్టమీది బాలరాజ్, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు బ్యాగరి శ్రీనివాసులు, కార్యదర్శి గోకం చెన్నయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. వెంకట రాములు, ఎం అశోక్ కుమార్, చెన్నయ్య పాల్గొన్నారు. 

నాగర్​కర్నూల్​ జిల్లా పోలీస్​ ఆఫీస్​లో వెంకటస్వామి వర్ధంతిని జరుపుకున్నారు. పోలీస్​ అధికారులతో కలిసి ఎస్పీ సంగ్రామ్  సింగ్  కాకా ఫొటోకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రిగా వెంకటస్వామి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు.