బషీర్బాగ్, వెలుగు: టైపిస్టు, స్టెనోగ్రాఫర్స్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రికగ్నైస్డ్ టైప్ రైటింగ్ షర్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హైదర్ గూడ లోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్బాలిగ మాట్లాడారు.
పదేళ్లుగా టైపిస్ట్ , స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో టైప్ రైటింగ్ పై ఆధారపడ్డ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ స్కిల్స్ ను స్కిల్ యూనివర్సిటీలో చేర్చాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 3 , 4 పోస్టుల్లో టైపిస్ట్ లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
