
పాకిస్తాన్ దేశం.. సైనిక శక్తిలో ఇండియాతో పోల్చితే వేస్ట్.. మనలో సగం కూడా లేదు.. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాల్లో ఇండియా బలం ముందు పాకిస్తాన్ దేనికీ పనికి రాదు.. ఈ విషయంలో మన దేశానికి చాలా చాలా క్లారిటీ ఉంది. యుద్ధం అంటూ వస్తే మన బలం ముందు పాక్ తోక ముడచటం ఖాయం.. ఇదంతా సైనిక బలం.. శక్తి సామర్ధ్యాల విషయంలో.. అయితే.. ఇక్కడే ఓ విషయం భారత్ నిశితంగా గమనిస్తుంది. పాకిస్తాన్ పై ప్రత్యేక నిఘా పెట్టింది.
పాకిస్తాన్ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన దళం ఒకటి ఉందని.. దాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి.. దాన్ని ఎలా ఎదుర్కోవాలి.. ఆ దళాన్ని ఎలా మట్టుబెట్టాలి.. ఆ దళాన్ని నామరూపాల్లేకుండా ఎలా చేయాలి.. ఆ దళంలోని వాళ్లను ఎలా చంపాలి.. మళ్లీ పుట్టకుండా.. మళ్లీ అలాంటి ఆలోచన చేయకుండా ఆ దళాన్ని ఎలా తుడిచిపెట్టాలి అని భారత్ తీవ్రంగా ఆలోచిస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే ప్రత్యేక నిఘా పెట్టి.. డేటా అనాలసిస్ చేస్తోంది.
ఆత్మాహుతి దళాలు నడిపేది పాకిస్తాన్ మాజీ సైనికులే:
పాకిస్తాన్ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన దళం ఏంటో తెలుసా.. ఆత్మాహుతి దళం. ఈ దళాలను పాక్ సైన్యం.. పాక్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐ కనుసన్నల్లోనే నడుస్తుంది. పాక్ మాజీ సైనిక అధికారులు. మాజీ సైనికులు ఈ దళాలకు నాయకత్వం వహిస్తున్నారంట. కొంత మంది జీహాదీలు, లష్కర్ ఏ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి పాక్ మాజీ సైనికులు, సైన్యంలో కీలక పదవుల్లో పని చేసిన ఉన్నతస్థాయి అధికారులు ఈ దళాలను తయారు చేశారంట.
►ALSO READ | పీఓకేకు ఫ్లైట్లు రద్దు చేసిన పాక్ .. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం
ఇండియా, పాక్ సరిహద్దుల్లో ఇలాంటి క్యాంప్స్ చాలా ఉన్నాయంట. ఈ క్యాంపుల్లో ఎంత మంది ఇలాంటి టెర్రరిస్టులు ఉన్నారు.. ఎంత మంది ఆత్మాహుతిదారులను పాకిస్తాన్ తయారు చేసింది అనేది ఇప్పుడు భారత్ నిఘా పెట్టింది. పుల్వామా ఎటాక్ తర్వాత భారత్ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ కూడా ఇలాంటి శిబిరాలు, దళాలపైనే.. ఇది జరిగి ఆరేళ్లు అవుతుండటంతో.. మళ్లీ పాక్ ఆర్మీ.. ఇలాంటి ప్రమాదకర దళాలను తయారు చేసే శిబిరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా భారత్ కు సమాచారం వచ్చిదంట..
పాకిస్తాన్ పై యుద్ధం మొదలుపెడితే.. ఈ ఆత్మాహుతి దళాల ఎటాక్ ఎలా ఉంటుంది.. ఈ దళాలు కాశ్మీర్ లోకి.. ఇండియాలోకి ఇప్పటికే ఏమైనా ప్రవేశించాయి.. భారత్ లో ఆశ్రయం పొందుతున్నాయా అనేది కూడా భారత్ తీవ్రంగా పరిశీలిస్తుంది.
భారత్ ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేని పాకిస్తాన్.. ఇలాంటి దళాలను ఉపయోగించుకుని.. భారత్ ను దొంగ చాటుగా దొంగ దెబ్బ కొట్టే అవకాశాలు లేకపోలేదు.. ఈ విషయంలోనూ తీవ్రంగా ఆలోచిస్తున్న ఇండియా.. ఆ దిశగా ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.