- బెంగళూరులో రోడ్ టెర్రర్.. కారు, ఆర్టీసీ బస్సు ఢీ
- కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్పాట్ డెడ్
- కలకలం రేపుతున్న వరుస ఘోర రోడ్డు ప్రమాదాలు
- అదే అతివేగం, అదే విధ్వంసం.. నిన్న ఆరుగురు, ఇవాళ ఐదుగురు మృతి
- రెండు ప్రమాదాల్లో తుక్కు తుక్కు అయిన కార్లు
బెంగళూరులో రోడ్ టెర్రర్..24 గంటల్లో రెండో రోడ్డు ప్రమాదం.. అదే అతివేగం.. అదే విధ్వంసం.. నిన్న ఆరుగురు, ఇవాళ ఐదుగురు మృతి.. యాక్సిడెంట్ అయిందా ఒక్కరు మిగలడం లేదు.. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం.. తుక్కు తుక్కయిన కార్లు..ఛిద్రమైన మృతదేహాల దృశ్యాలు భయానకం.. బెంగళూరు శివారులో తుమకూరులో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
బెంగళూరు శివారులో తుమకూరులో రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఇండికా కారు, కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు స్పాట్ లో నే చనిపోయారు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో టాటా ఇండికా కారు డివైడర్ ను ఢీకొట్టి లేన్ దాటి పల్టీలు కొట్టుకుంటూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.
ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. కారు డ్రైవర్ తీవ్రంగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు ప్రైవేట్ కాలేజీ విద్యార్ధులు ఉన్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు కూడా గాయాయల్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులుండగా ముందు వరసలో ఉన్న వారికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
