Hydra: కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో హైడ్రా కూల్చివేతలు.. అక్రమ కట్టడాల నేలమట్టం

Hydra: కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో హైడ్రా కూల్చివేతలు.. అక్రమ కట్టడాల నేలమట్టం

హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఏరియాలో అక్రమ కట్టడాలపై హైడ్రా విరుచుకుపడింది. గురువారం (మే 1) సూరారం పోలీస్ స్టేషన్  పరిదిలో ఆక్రమణలపై కొరడా ఝుళిపించింది. సూరారం కాలనీ సమీపంలో పలు ఆక్రమణల గురించి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూల్చివేతలకు దిగింది.

సూరారం పరిధిలో సర్వే నెంబర్ 29 స్థలంలో రోడ్డు లేకుండా ప్రహరీ నిర్మించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో తెల్లవారుజామున 5 గంటలకే ప్రహరీ కూల్చివేతను చేపట్టారు  హైడ్రా అధికారులు. పోలీసులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాల సమక్షంలో ఆక్రమణలను తొలగించింది హైడ్రా.