Retro X Review: ‘రెట్రో’ X రివ్యూ.. సూర్య పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Retro X Review: ‘రెట్రో’ X రివ్యూ.. సూర్య పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ (Retro). పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్. స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు గురువారం (మే1న) పాన్ ఇండియా భాషల్లో విడుదలైంది. తెలుగులో సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థ విడుదల చేసింది.

ఈ మూవీ ప్రీమియర్స్ ఓవర్సీస్తో పాటుగా తమిళనాడు, కర్ణాటకలో పూర్తయ్యాయి. సినిమా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. మరి రెట్రో మూవీ ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో X రివ్యూలో చూద్దాం.   

పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ మూవీగా రెట్రో తెరకెక్కింది. ఇందులో సూర్య పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించాడు. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించాడు.ఈ యాక్షన్‌‌ లవ్‌‌ స్టోరీలో సూర్య డిఫరెంట్‌‌ గెటప్స్‌‌లో కనిపించాడు. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్, మాస్ సీన్స్ సినిమాకే హైలెట్. ఎప్పటిలాగే సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్, కెమెరా విజువల్స్ సైతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని చెబుతున్నారు.

►ALSO READ | Hit3 X Review: హిట్ 3 X రివ్యూ.. 

లవ్‌‌ సీన్స్‌‌తో పాటు మాస్‌‌, యాక్షన్‌‌ సీన్స్‌‌తో ఫ్యాన్స్లో అదరగొట్టాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. "ప్రేమ, నవ్వు మరియు యుద్ధం" అంశాల భావోద్వేగ లోతును ఉత్కంఠభరితమైన యాక్షన్‌తో సినిమా సాగిందని నెటిజన్స్ చెబుతున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే తన కెరీర్ లో అత్యుత్తమ నటన కనబరిచిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 

కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్లో సినిమా చాలా ఫాస్ట్గా, ఫుల్ యాక్షన్తో సాగిపోయిందని, సూర్య డిఫరెంట్ గెటప్స్, లుక్స్లో సినిమా మొత్తం సందడి చేశాడని అంటున్నారు. ఈ మూవీ కార్తీక్ సుబ్బరాజ్- సూర్య ఇద్దరి సంతకాల సంభవం అని, ప్రేక్షకులను వింటేజ్ కాలానికి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. 

సంతోష్ నారాయణన్ కిల్లర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో  రెట్రో సినిమాను పర్ఫెక్ట్‌గా సెట్ చేశారు. సూర్యతో పాటు పూజా హెగ్డే, జయరామ్, ప్రకాష్ రాజ్, జోజు జార్జ్ పాత్రలను సరిగ్గా వాడుకున్నారు డైరెక్టర్ సుబ్బరాజ్. సూర్య పాత్ర తన ప్రేమికురాలు పూజా హెగ్డే పోషించిన పాత్రకు భిన్నంగా ఉంది. గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ అయిన సూర్య.. గొడవలు, పంచాయితీలు, రక్తపాతాలు, రౌడీయిజాలు చేస్తుంటే, అవన్నీ వదిలేసి మారిపో అనే పాత్రలో నటించింది.