
కరీంనగర్ సిటీ, వెలుగు: ఏటా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను ఈ నెల 22న కరీంనగర్ లో చేపట్టనున్నట్లు ఆర్ఎస్ఎస్ కరీంనగర్విభాగ్సహ సంఘ్చాలక్డాక్టర్ సీహెచ్.రమణాచారి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రావు తెలిపారు. సంబంధిత పోస్టర్ను బుధవరాం కరీంనగర్లోని వైశ్య భవన్లో ఆవిష్కరించారు.
వివిధ కులాల, ప్రజా, ఆధ్యాత్మిక సంఘాల నాయకులు ఈ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభక్క, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్లు యాదగిరి సునీల్ రావు, డి. శంకర్, వాసాల రమేష్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, మాజీ కార్పొరేటర్ వంగల పవన్, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, నాయకులు పాల్గొన్నారు.