రెండ్రోజుల్లో ఎంట్రెస్ట్ టెస్టుల తేదీలు.. సర్కారుకు టీజీసీహెచ్ఈ ప్రతిపాదనలు

రెండ్రోజుల్లో ఎంట్రెస్ట్ టెస్టుల తేదీలు.. సర్కారుకు టీజీసీహెచ్ఈ ప్రతిపాదనలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే కామన్  ఎంట్రన్స్  టెస్టుల (సెట్స్) షెడ్యూల్  విడుదలకు రంగం సిద్ధమైంది. సోమ లేదా మంగళవారం అధికారికంగా ప్రకటన రానున్నది. వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం సంబంధించి ఈఏపీ సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, పీజీఎల్​సెట్, ఎడ్ సెట్, పీజీఈ సెట్, పీఈ సెట్  తదితర ప్రవేశపరీక్షల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఏయే ఎంట్రన్స్ టెస్ట్‌‌‌‌కు ఏ యూనివర్సిటీ నోడల్  ఏజెన్సీగా వ్యవహరించనుందనే వివరాలతో పాటు, కన్వీనర్ల పేర్లు, పరీక్షల తేదీలను ఒకేసారి ప్రకటించనున్నారు. 

జాతీయ స్థాయి పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకొని, వాటితో క్లాష్  కాకుండా రాష్ట్ర సెట్స్  తేదీలను ఫైనల్  చేశారు. ఇప్పటికే హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  ఆయా వివరాలను ఖరారు చేసి, సర్కారు ఆమోదం కోసం పంపించారు. అక్కడి నుంచి అనుమతి రాగానే తేదీలను వెల్లడించనున్నారు.