జూబ్లీహిల్స్, వెలుగు: ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరు అరెస్ట్అయ్యారు. బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలెడ్జ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ పేరుతో హేమ రోహిత్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. తన సన్నిహితుడు భవాని శంకర్ తో కలిసిమెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద సుమారు రూ.69 లక్షలు వసూలు చేశాడు.
అనంతరం ఇద్దరూ పరారయ్యారు. బాధితులు గత ఆగస్టు 13న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరం ఒప్పుకున్నారు. గతంలో జూబ్లీహిల్స్ లో చెక్ మెట్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు వీరిపై కేసు ఉంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
