ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సురేశ్

ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సురేశ్
  • వార్షిక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పెరిక సురేశ్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ బోట్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్ ఆర్ ప్రేమ్‌‌‌‌‌‌‌‌రాజ్ అధ్యక్షతన జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ గా పెరిక సురేశ్, జాయింట్ సెక్రటరీగా విజేందర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా సురేందర్ జోసెఫ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సురేశ్​మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడలను మెరుగుపర్చడం, అథ్లెట్ల సంక్షేమం కోసం అసోసియేషన్ చేపట్టే కృషిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. 

ఒలింపిక్ స్ఫూర్తిని ప్రోత్సహించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో రాష్ట్రం మెరుగైన ప్రదర్శన చేసేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు  ప్రేమ్‌‌‌‌‌‌‌‌రాజ్, జనరల్ సెక్రటరీ బాబూరావు, ట్రెజరర్ తుమ్కూర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.