ఫిడే వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‎లో మూడో ప్లేస్‌‎లో అర్జున్‌‌‌‌

ఫిడే వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‎లో మూడో ప్లేస్‌‎లో అర్జున్‌‌‌‌

దోహా: తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ ఎరిగైసి.. ఫిడే వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో వరుస విజయాలతో హోరెత్తిస్తున్నాడు. ర్యాపిడ్‌‎లో భాగంగా ఆదివారం జరిగిన నాలుగు రౌండ్లలోనూ అర్జున్‌‌‌‌ గెలుపొందాడు. దాంతో 13 రౌండ్లు ముగిసేసరికి 9.5 పాయింట్లతో మూడో ప్లేస్‌‌‌‌లో కొనసాగుతున్నాడు. సెవియన్‌‌‌‌ సామ్యూల్‌‌‌‌, ఎర్డోగమస్‌‌‌‌ యాజిజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, మెమెదోవ్‌‌‌‌ రవూఫ్‌‌‌‌, షిమనోవ్‌‌‌‌ అలెగ్జాండర్‌‌‌‌తో జరిగిన గేమ్‌‌‌‌ల్లో అర్జున్‌‌‌‌ విజయాలు సాధించాడు. గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌ (8.5), ప్రజ్ఞానంద (8.5) వరుసగా 20, 28వ స్థానాల్లో ఉన్నారు. విమెన్స్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో గ్రాండ్ మాస్టర్‌‌‌‌ కోనేరు హంపి 8.5 పాయింట్లతో మూడో స్థానంలో  కొనసాగుతోంది. వైశాలి (8), దివ్యా దేశ్‌‌‌‌ముఖ్‌‌‌‌ (7.5), ద్రోణవల్లి హారిక (7).. వరుసగా 5, 8, 19వ ర్యాంక్‌‌‌‌ల్లో ఉన్నారు.