డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి : డెస్క్ జర్నలిస్టులు

డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి : డెస్క్ జర్నలిస్టులు

కరీంనగర్, వెలుగు: డెస్క్ జర్నలిస్టులకు గతంలో ఇచ్చినట్లే అక్రిడిటేషషన్ కార్డులే ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 252ను వెంటనే సవరించాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ ​చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్ట్స్​ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్​టీ)​ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం జర్నలిస్టుల మధ్య విభజన తీసుకురావడం అన్యాయమన్నారు. 

డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు ఇస్తామనడం తగదని, ఫీల్డ్,  డెస్క్ జర్నలిస్టులు సమన్వయంతో పని చేస్తేనే ప్రజలకు నాణ్యమైన సమాచారం చేరుతుందని తెలిపారు. అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. -డెస్క్ జర్నలిస్టులకూ జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ కు అందజేశారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ, రాష్ట్ర నాయకులు ప్రకాశ్​రావు, వేణుగోపాల్​రావు, జిల్లా నాయకులు సంపత్, రామకృష్ణ, హృషికేష్, కొండల్ రెడ్డి, యాదగిరి, డెస్క్ జర్నలిస్ట్ నాయకులు సుభాష్, సంపత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.