ఇంట్లో పెద్ద స్క్రీన్ పై సినిమాలకోసం..4K HDR వీడియో ప్రొజెక్టర్‌

ఇంట్లో పెద్ద స్క్రీన్ పై సినిమాలకోసం..4K HDR వీడియో ప్రొజెక్టర్‌

చాలామంది సినిమాలు, సిరీస్‌‌‌‌‌‌‌‌లను పెద్ద స్క్రీన్‌‌‌‌‌‌‌‌పై చూసేందుకు ఇష్టపడతారు. అలాంటి వాళ్లు ఈ ప్రొజెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని వాడితే సరిపోతుంది. ఈ ‘యువ గో ప్లస్‌‌‌‌‌‌‌‌’ ప్రొజెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌, ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీన్ని ఫోన్‌‌‌‌‌‌‌‌, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌, టీవీ స్టిక్‌‌‌‌‌‌‌‌, టీవీ బాక్స్‌‌‌‌‌‌‌‌.. ఇలా దేనికైనా కనెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసి వాడుకోవచ్చు. ఇది పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ లైట్ సోర్స్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది.

 4కే హెచ్‌‌‌‌‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోలకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. 1920x1080 రిజల్యూషన్‌‌‌‌‌‌‌‌తో వీడియో ప్లే అవుతుంది. అంతేకాదు.. ఇందులో కొన్ని ఓటీటీ యాప్‌‌‌‌‌‌‌‌లు ప్రీ ఇన్​స్టాల్‌ చేసి ఉంటాయి. డ్యూయల్-బ్యాండ్‌‌‌‌‌‌‌‌ వైఫైకి సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. దీన్ని ప్రత్యేకంగా ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రొజెక్టర్ నెక్‌‌‌‌‌‌‌‌ని ఎటువైపైనా తిప్పుకోవచ్చు. 

పైకప్పు, గోడ.. ఇలా ఎక్కడైనా ప్రొజెక్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. ఇది బ్లూటూత్‌‌‌‌‌‌‌‌ కనెక్టివిటీతో రావడం వల్ల వైర్‌‌‌‌‌‌‌‌లెస్ స్పీకర్లు, హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లు, సౌండ్‌‌‌‌‌‌‌‌బార్‌‌‌‌‌‌‌‌ లాంటివి కనెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. ఇందులో ఇన్‌‌‌‌‌‌‌‌బిల్ట్ స్పీకర్లు కూడా ఉంటాయి.