రూ.40 వేల లోపు స్మార్ట్ ఫోన్ కొనాలనుకుని చూస్తుంటే రెడ్ మీ నోట్ 17 ప్రో (Redmi Note 17 Pro 5G) స్మార్ట్ ఫోన్పై ఓ లుక్కేయొచ్చు. బ్యాటరీ బ్యాకప్ ఈ ఫోన్ హైలైట్ అని చెప్పొచ్చు. 9000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ను ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే.. 21 గంటల 55 నిమిషాల పాటు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
రూ. 40,000 లోపు ఫోన్‌లలో బ్యాటరీ విషయంలో బెటర్ ఫోన్ ఇదేనని చెప్పొచ్చు. 20 గంటల 45 నిమిషాల పాటు పనిచేసే అవకాశం ఉన్న పోకో ఎక్స్8 పవర్ (POCO X8 Power) 10,000mAh బ్యాటరీని కూడా రెడ్ మీ నోట్ బ్యాటరీ దాటేసింది. వివో టి5 (Vivo T5)ను 14 గంటల 42 నిమిషాల పాటు ఏకధాటిగా వాడుకోవచ్చు.
Redmi Note 17 Pro 5G ఫోన్ బ్యాటరీ బ్యాకప్ విషయంలో.. Vivo T5ను కూడా దాటేసింది. యావరేజ్గా వాడుకుంటే Redmi Note 17 Pro 5G ఫోన్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే మూడున్నర రోజుల దాకా స్వి్చ్ ఆఫ్ అవకుండా నడుస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 36 వేల 999 రూపాయలుగా ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర39 వేల 999 రూపాయలుగా ఉంది.
స్నాప్ డ్రాగన్ 6s Gen 4తో నడుస్తుంది. ఆండ్రాయిడ్ 16లో Xiaomi HyperOS 3 ఆపరేటింగ్ సిస్టమ్ 4 ఏళ్ల OS అప్డేట్స్, డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ విత్ Dolby Atmosతో Redmi Note 17 Pro 5G ఫోన్ మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇలా మొత్తంగా 40 వేల రూపాయల బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తుంటే Redmi Note 17 Pro 5G ఫోన్ బ్యాడ్ ఆప్షన్ అయితే కాదు.
