ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. BSNL ప్రీపెయిడ్ కస్టమర్లు రెండు రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే లక్ష రూపాయల దాకా బీమా పొందొచ్చు. రూ. 202 ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే.. 30 రోజుల పాటు 300 నిమిషాల కాల్స్, 5GB డేటా,100 SMSలను అందిస్తుంది.
రూ. 2,449 ప్లాన్‌లో 365 రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ప్లాన్ ధరతో పాటు అదనపు ఖర్చు లేకుండా, ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే వినియోగదారులకు రూ. 1 లక్ష వరకు, సైబర్ మోసం జరిగితే రూ. 10,000 వరకు కవరేజీని BSNL అందిస్తుంది. ఈ ఆఫర్ కోసం BSNL, ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
* రూ. 202 ప్లాన్: ఈ STV (స్పెషల్ టారిఫ్ వోచర్) 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది ఇన్సూరెన్స్ ప్రయోజనంతో పాటు 300 నిమిషాల కాలింగ్, 5GB డేటా, 100 SMSలను అందిస్తుంది.
* రూ. 2,449 ప్లాన్: ఈ వార్షిక STV (స్పెషల్ టారిఫ్ వోచర్) ఆఫర్ 365 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. దీనితో అపరిమిత కాల్స్ (లోకల్ + STD + రోమింగ్), రోజుకు 2GB డేటా మరియు రోజుకు 100 SMSలు లభిస్తాయి.
* BSNL నంబర్‌ను రీఛార్జ్ చేసిన 24 గంటలలోపు ఈ ప్లాన్‌లపై బీమా కవరేజ్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. వ్యాలిడిటీ ప్లాన్ ముగింపు తేదీతో పాటు ముగుస్తుంది.
* ప్రమాదవశాత్తు మరణం, రోడ్డు ప్రమాదాలు, పాము కాట్లు, కాలిన గాయాలు, విద్యుదాఘాతం, పిడుగుపాటు వలన సంభవించే మరణాలను ఈ బీమా కవర్ చేస్తుంది. అయితే జరిగిన ఘటన గురించి.. సంఘటన జరిగిన 48 గంటలలోపు BSNLకు తెలియజేయాలి.
క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి.. టోల్-ఫ్రీ నంబర్ 1800 11 8485 కు కాల్ చేయవచ్చు. [email protected]కు ఈ-మెయిల్ కూడా పంపవచ్చు. కంపెనీ ఉచిత సిమ్, రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు, 24 రోజుల వ్యాలిడిటీ ప్రయోజనాలతో రూ.1 ప్లాన్‌తో BSNL ఫ్రీడమ్ 2.0ను కూడా ప్రవేశపెట్టింది.
