చిన్న చిన్న వస్తువులను పోగొట్టుకున్నప్పుడు ఇంట్లోని ప్రతి సందులో వెతకాలంటే కాస్త కష్టమే. అలాంటప్పుడు ఈ ఎండోస్కోప్ కెమెరాని వాడితే సరిపోతుంది. దీన్ని మయూమి అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వస్తువులనే కాదు.. ఇది బాత్ టబ్ పైపుల్లో, సింక్ డ్రెయిన్‌లోని బ్లాకేజీలను గుర్తించడానికి కూడా ఇది సాయపడుతుంది.
దీన్ని ఓటీజీ కనెక్టర్ ద్వారా ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ నుంచి ‘ఎంస్కోప్స్’ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుని సెటప్ చేసుకుంటే సరిపోతుంది. కెమెరా క్యాప్చర్ చేసే ఫుటేజీ ఫోన్‌లో కనిపిస్తుంది.
ఈ కెమెరాకు 5 మీటర్ల సెమీ-రిజిడ్ కేబుల్ ఉంటుంది. దీన్ని 360 డిగ్రీల్లో ఎటు వైపైనా తిప్పుకోవచ్చు. కెమెరా ఐపీ67 వాటర్ ప్రూఫ్‌తో వస్తుంది. కాబట్టి నీళ్లలో మునిగినా పాడవ్వదు. చీకట్లో క్యాప్చర్ చేసేందుకు దీనికి ప్రత్యేకంగా ఆరు ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి.
