జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. శనివారం జగిత్యాల కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. వేసవికి ముందే పెండింగ్ పనులను పూర్తి చేయాలని చెప్పారు.
నట్టల నివారణ మందు పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం పశుపోషణకు ప్రాధాన్యం ఇస్తూ గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి మండలంలోని నక్కలపేటలో శనివారం జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
